ETV Bharat / state

త్వరలోనే మేయర్ అభ్యర్థిని ప్రకటిస్తాం: ఉత్తమ్ - కాంగ్రెస్ నేతలతో ఉత్తమ్ భేటీ

హైదరాబాద్ ఇందిరా భవన్‌లో జీహెచ్‌ఎంసీ పరిధిలోని కాంగ్రెస్‌ డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు.

త్వరలోనే మేయర్ అభ్యర్థిని ప్రకటిస్తాం: ఉత్తమ్

author img

By

Published : Sep 11, 2020, 8:23 PM IST

రిజర్వేషన్ల ఆధారంగా మేయర్‌ అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఇందిరా భవన్‌లో జీహెచ్‌ఎంసీ పరిధిలోని కాంగ్రెస్‌ డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులతో ఉత్తమ్ సమావేశమయ్యారు. ఈనెల 18లోగా డివిజన్ కమిటీలు, బ్లాక్ కమిటీలు కూడా పూర్తి చేయాలన్నారు. డివిజన్లలో అభ్యర్థులు ఎవరో ముందుగానే నిర్ణయించుకోవాలని సూచించారు.

హైదరాబాద్‌ అభివృద్ధి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే జరిగిందన్న పీసీసీ అధ్యక్షుడు... తెరాస ప్రభుత్వం మాటలు తప్ప ఏమి చేయదని గడిచిన ఆరేళ్ల పాలనలో తేలిపోయిందని ఆరోపించారు. కేసీఆర్ పాలన పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, కార్యకర్తలకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చిన కాంగ్రెస్ నేతలంతా అండగా నిలబడతామన్నారు.

ఇదీ చూడండి: వివేకా బోధనలు విద్యార్థులకు, యువతకు ఆదర్శం: గవర్నర్ తమిళసై

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.