రాష్ట్రంలో దోపిడీని అడ్డుకోవడానికి మేము వాచ్‌డాగ్ తరహాలో వ్యవహరిస్తామని... సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. తెరాస నేతల అవినీతిని బయటపెట్టడానికి మేమంతా మొరుగుతూనే ఉంటామని స్పష్టం చేశారు.
సభలో తెరాస మంత్రులు... దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని భట్టి ఆక్షేపించారు. కుక్కల్లా మొరుగుతున్నారని ఒక మంత్రి... ఉరికించి కొడతారని మరో మంత్రి... సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్ధతి కాదన్నారు.
ఇవీ చూడండి: తెలంగాణ నేలపై డైనోసార్లు