మున్సిపల్ ఎన్నికల్లో తెదేపా అధిక డివిజన్లు గెలిచిన చోట్ల ఎక్స్ అఫీషియోలతో తామే అధికారం చేపడతామని.. ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. జగన్ పాలనపై ప్రజలు నమ్మకం ఉంచారన్న ఆయన.. నిబద్ధతతో పనిచేసే నాయకుడికి ప్రజల మద్దతు ఉంటుందని నిరూపితమైందని వ్యాఖ్యానించారు.
ఈ విజయం తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్న మంత్రి.. మళ్లీ అభివృద్ధికి పునరంకితమవుతామని తెలిపారు. రానున్న రోజుల్లో మరింత బాధ్యతగా పని చేస్తామన్న బొత్స.. మేయర్, ఛైర్మన్ ఎంపికను పార్టీ అధ్యక్షుడు నిర్ణయిస్తారని వివరించారు.
ఇదీ చదవండి: భారీగా తరలివచ్చిన పట్టభద్రులు... 60 శాతానికి పైగా పోలింగ్!