ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితాలు, ఇతర ఏర్పాట్లపై అధికారులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. పురపాలక ఎన్నికల నిర్వహణపై మున్సిపల్ కమిషనర్లు, ప్రత్యేకాధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం శిక్షణా కార్యక్రమం నిర్వహించింది. మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్నికలు జరగనున్న మూడు కార్పొరేషన్లు, 129 మున్సిపాలిటీల కమిషనర్లు, ప్రత్యేకాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి, పురపాలక శాఖ సంచాలకులు శ్రీదేవి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈనెల 14న ఓటర్ల తుది జాబితా ప్రకటించాలని తెలిపారు. రేపు మున్సిపాలిటీల స్థాయిలో రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం వార్డుల పునర్విభజన పూర్తి చేసినందుకు అధికారులను పురపాలక శాఖ సంచాలకురాలు శ్రీదేవి అభినందించారు. ఎన్నికలను పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని శ్రీదేవి సూచించారు.
ఇవీ చూడండి: WC19: ఆచితూచి ఆడుతున్న భారత్