జీహెచ్‌ఎంసీలో వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితా ప్రకటించారు. 30 సర్కిల్ కార్యాలయాలు, రెవెన్యూ కార్యాలయాలు, వార్డు కార్యాలయాల్లో ఓటర్ల జాబితాను జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్లు ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో వార్డుల వారీగా వివరాలు పొందుపరిచారు.
ఓటర్ల జాబితాలో పేర్లు లేకుంటే ఫారం-6 ద్వారా దరఖాస్తుకు అవకాశం కల్పించారు. గ్రేటర్‌లోని 150 వార్డుల పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా ప్రకటించారు. పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాపై ఈనెల 17వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తారు. ఈనెల 21న తుది పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటిస్తారు.
ఇదీ చూడండి: పెద్దల సభకు వెళ్తున్న ఈ ముగ్గురి నేపథ్యం తెలుసా...?