ETV Bharat / state

నేడు ఓరుగల్లు ప్రథమ పౌరుడి ఎన్నిక - warangal

వరంగల్​ నగర పాలక సంస్థ మేయర్​ ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు కౌన్సిల్​ హాల్లో జరిగే సమావేశంలో కొత్త మేయర్​ని కార్పొరేటర్లు ఎన్నుకుంటారు. మెజార్టీ సభ్యులు తెరాసకు ఉండటం వల్ల ఈ ఎన్నిక లాంఛనం కానుంది.

నేడు ఓరుగల్లు ప్రథమ పౌరుడి ఎన్నిక
author img

By

Published : Apr 27, 2019, 5:08 AM IST

Updated : Apr 27, 2019, 7:30 AM IST

చారిత్రక నగరం ఓరుగల్లుకు ప్రథమ పౌరుడు ఎవరన్న ఉత్కంఠకు ఇవాళ తెరపడనుంది. ఉదయం 11 గంటలకు నగరపాలక సంస్థ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో మేయర్​ను ఎన్నుకోనున్నారు. మొత్తం 58మంది కార్పొరేటర్లు ఉండగా.... తెరాస వైపే 53 మంది సభ్యులు ఉండటం వల్ల మేయర్​ ఎన్నిక లాంఛనమే కానుంది. ఇక మేయర్​ ఎవరైతే బాగుంటుందన్న దానిపైన అధిష్ఠానం ఈసారి విస్తృత కసరత్తు నిర్వహించింది. ఈ​ ఎన్నిక బాధ్యతను పార్టీ ప్రధాన కార్యదర్శి బాలమల్లుకి అప్పగించారు.

నేడు ఓరుగల్లు ప్రథమ పౌరుడి ఎన్నిక

అధిష్ఠానం ఆదేశాలతో బాలమల్లు వరంగల్​లో రెండు రోజులు పాటు ఉండి కార్పొరేటర్ల అభిప్రాయాలను సేకరించారు. నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నాయకుల సూచనలను తీసుకొని నివేదిక రూపంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​లకు అందించారు.

మేయర్​ పదవిపై ఉత్కంఠ..

ఈసారి మేయర్ పదవికి గతంలో ఎప్పుడూ లేనంత పోటీ ఏర్పడింది. ఎక్కువమంది కార్పొరేటర్లు ప్రథమ పౌరుడి పదవిని ఆశించి ఇందుకోసం తమవంతు ప్రయత్నాలు చేశారు. రాజధానిలోనే మకాం వేసి... పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇతర నేతలను కలిసి తమ మనసులోని మాటను తెలియజేశారు. ప్రధానంగా మహిళా కార్పొరేటర్లు తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాల్సిందిగా కేటీఆర్​కు విజ్ఞప్తి చేశారు. తూర్పు నియోజకవర్గానికే మేయర్ పదవి దక్కాలని కొందరు... పశ్చిమ నియోజకవర్గానికి ఈసారి అవకాశం ఇవ్వాలని కోరడం వల్ల మేయర్ పదవి ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ పెరిగింది.

ఎంపిక చేయనున్న అధిష్ఠానం...

మేయర్​గా ఎవరిని ఖరారు చేసినా... పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ.. కార్పొరేటర్లు తీర్మానం చేశారు. అనుభవం, సమర్థత, విధేయత, ఎమ్మెల్యేల మద్దతు, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని.. అధిష్ఠానం ఎంపిక చేయనుంది.

Intro:యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల తొలి విడత నామినేషన్ల పర్వం ఊపందుకుంది. నిన్న మంగళవారం కావడంతో నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపించలేదు. గత రెండు రోజుల్లో 67 ఎంపీటీసీ స్థానాలకు గాను 55 నామినేషన్లు దాఖలయ్యాయి , 5 జడ్పిటిసి స్థానాలకు కేవలం 3 నామినేషన్లు మాత్రమే దాఖలు అయ్యాయి. ఇక కొద్ది గంటల సమయం మాత్రమే ఉండడంతో అభ్యర్థులు బారులుతీరారు .చివరి రోజు రెట్టింపు సంఖ్యలో నామ పత్రాలు దాఖలయ్యే అవకాశం ఉంది.

Body:యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల తొలి విడత నామినేషన్ల పర్వం ఊపందుకుంది. నిన్న మంగళవారం కావడంతో నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపించలేదు. గత రెండు రోజుల్లో 67 ఎంపీటీసీ స్థానాలకు గాను 55 నామినేషన్లు దాఖలయ్యాయి , 5 జడ్పిటిసి స్థానాలకు కేవలం 3 నామినేషన్లు మాత్రమే దాఖలు అయ్యాయి. ఇక కొద్ది గంటల సమయం మాత్రమే ఉండడంతో అభ్యర్థులు బారులుతీరారు .చివరి రోజు రెట్టింపు సంఖ్యలో నామ పత్రాలు దాఖలయ్యే అవకాశం ఉంది.

Conclusion:యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల తొలి విడత నామినేషన్ల పర్వం ఊపందుకుంది. నిన్న మంగళవారం కావడంతో నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపించలేదు. గత రెండు రోజుల్లో 67 ఎంపీటీసీ స్థానాలకు గాను 55 నామినేషన్లు దాఖలయ్యాయి , 5 జడ్పిటిసి స్థానాలకు కేవలం 3 నామినేషన్లు మాత్రమే దాఖలు అయ్యాయి. ఇక కొద్ది గంటల సమయం మాత్రమే ఉండడంతో అభ్యర్థులు బారులుతీరారు .చివరి రోజు రెట్టింపు సంఖ్యలో నామ పత్రాలు దాఖలయ్యే అవకాశం ఉంది.
Last Updated : Apr 27, 2019, 7:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.