ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు సమీపంలో బి.తాండ్రపాడు వద్ద పీర్ల పండుగను నిర్వహిస్తున్న సమయంలో గోడ కూలి 20 మంది గాయపడ్డారు. పీర్లు ఉరేగిస్తున్న సమయంలో ఘటన జరిగినట్లు స్థానికులు వివరించారు. ఘటనలో తీవ్రంగా గాయవడిన ఐదుగురిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.
ఇదీ చదవండి : చేపల వేటకెళ్లిన యువకుడు గల్లంతు