'ఒకరిద్దరు తప్పు చేస్తే అందరిని అవినీతిపరులంటారా?'
ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా సహకరిస్తామన్న రెవెన్యూ ఉద్యోగులు... ధరణి అప్డేట్ అవకాశం ఇస్తే రెండు నెలల్లో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు. మంచిర్యాల ఉదంతంలో రెవెన్యూ అధికారులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు.
ఎస్కే జోషిని కలిసిన రెవెన్యూ ఉద్యోగులు
మంచిర్యాల రైతు వ్యవహారంలో రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కేజోషిని కలిశారు. ఉద్యోగుల సమస్యలను రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్, వీఆర్ఏల సంఘం వివరించాయి. పనిభారం ఎక్కువైనప్పటికీ... పండగలు, సెలవులు లేకుండా పనిచేస్తున్న తమపై అవినీతిపరులంటూ ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరిద్దరు తప్పు చేస్తే అందరినీ అవినీతిపరులుగా ముద్ర వేయడం తగదన్న రెవెన్యూ ఉద్యోగులు... మా కష్టాన్ని గుర్తించండి అంటూ విన్నవించారు. క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి ఉన్నతాధికారులు తీసుకెళ్లడం లేదని అన్నారు. రెవెన్యూ శాఖకు ప్రత్యేకంగా మంత్రి లేకపోవడం, పూర్తి స్థాయి సీసీఎల్ఏ లేకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయని వారు తెలిపారు.
Last Updated : Mar 30, 2019, 7:55 AM IST