ETV Bharat / state

KCR on VRAS : ప్రభుత్వ ఉద్యోగులుగా వీఆర్ఏలు.. ఉత్తర్వులు జారీ - VRAs as government employees in telangana

VRAS Permanent as Government Employees : తెలంగాణలో వీఆర్‌ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దుచేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చారిత్రక నిర్ణయం తీసుకోగా.. అందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇవాళ విడుదల అయ్యాయి. వీఆర్‌ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ.. రెవెన్యూ శాఖలో సూపర్‌ న్యూమరీ పోస్టులు సృష్టించి వారిని క్రమబద్దీకరించనున్నారు. సచివాలయంలో జీవో ప్రతిని వీఆర్‌ఏ జేఏసీ నేతలకు కేసీఆర్‌ అందజేశారు.

Good News to VRAs
Good News to VRAs
author img

By

Published : Jul 24, 2023, 10:51 PM IST

Updated : Jul 25, 2023, 6:46 AM IST

వీఆర్ఏలకు గుడ్‌న్యూస్‌ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు

VRAs as Government Employees in Telangana : భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన.. వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తున్నామని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం మేరకు.. వారిని పేస్కేలుతో వివిధ ప్రభుత్వ శాఖల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ధరణి ప్రవేశపెట్టిన తర్వాత.. వీఆర్‌ఏ వ్యవస్థ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వీఆర్‌ఏల వినతి, వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని, ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు.

KCR Good News to VRAS : ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు.. రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిత్తల్ జీవో 81 జారీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా.. 20,555 మంది వీఆర్‌ఏలు పనిచేస్తున్నారు. వీరిలో నిరక్షరాస్యులు, ఏడో తరగతి, పదో తరగతి పాసైనవారు, ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదివినవారు, డిగ్రీ ఆపై ఉన్నత చదువులు చదివినవారు ఉన్నారు. 61 ఏళ్ల లోపు వయసున్న 16,758 మంది వీఆర్‌ఏల సేవలను క్రమబద్ధీకరించి.. వివిధ ప్రభుత్వశాఖల్లో ఉద్యోగులుగా నియమించనున్నారు.

VRAS Permanent as Government Employees : ఉద్యోగ విరమణ వయసు 61 ఏళ్లు దాటిన.. మరో 3,797 మంది కుమారులు లేదా కుమార్తెలకు వారి అర్హతలను బట్టి కారుణ్య నియామకాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్హతల ఆధారంగా.. లోయర్ గ్రేడ్ సర్వీస్, రికార్డు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల్లో.. వీఆర్‌ఏలను నియమించనున్నారు. పదోతరగతివరకు చదివినవారు 10,317 మంది ఉండగా.. వారిని లోయర్‌గ్రేడ్‌ సర్వీసుకు తీసుకోనున్నారు. ఇంటర్‌ వరకు చదివినవారు 2,761 మంది ఉండగా.. వారిని రికార్డు అసిస్టెంట్‌లుగా తీసుకోనున్నారు. డిగ్రీ, అంతకుమించి చదివిన వారు 3,608 మంది ఉండగా.. వారిని జూనియర్‌ అసిస్టెంట్‌లుగా తీసుకోనున్నట్టు.. ప్రభుత్వ ఉత్తర్వుల్లో వివరించారు.

Good News to VRAs : వీఆర్‌ఏలు ఇక నుంచి పే స్కేల్ ఉద్యోగులని కేసీఆర్ పేర్కొన్నారు. ఆయా శాఖల్లో మంచి పేరు తెచ్చుకోవాలని, ఇంకా చదివి పదోన్నతులు కూడా పొందాలని ఆకాంక్షించారు. ఈ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా సీఎస్ శాంతి కుమారి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిత్తల్ ఈరోజే ఉత్తర్వులు వచ్చేలా కృషి చేశారని వివరించారు. వీఆర్‌ఏలను పేస్కేల్‌తో ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేస్తూ జారీ చేసిన జీవోను వీఆర్‌ఏ జేఏసీ నేతలకు సీఎం అందజేశారు. వీఆర్ఏలకు పేస్కేలు అమలు చేస్తున్నందుకు వీఆర్‌ఏ ఐకాస నేతలు.. కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

"వీఆర్‌ఏలు ఇక నుంచి పే స్కేల్ ఉద్యోగులు. ఆయా శాఖల్లో మంచి పేరు తెచ్చుకోవాలని, ఇంకా చదివి పదోన్నతులు కూడా పొందాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా సీఎస్ శాంతి కుమారి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిత్తల్ ఈరోజే ఉత్తర్వులు వచ్చేలా కృషి చేశారు." - కేసీఆర్, ముఖ్యమంత్రి

ఇవీ చదవండి : VRAs Arrangements : రెవెన్యూశాఖలోనే కొనసాగించాలి.. మంత్రివర్గ ఉపసంఘాన్ని కోరిన వీఆర్‌ఏ ఐకాస

వీఆర్‌ఏలతో మంత్రి కేటీఆర్‌ కీలక చర్చలు.. ఈసారైనా ఫలించేనా..!! :

Last Updated : Jul 25, 2023, 6:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.