ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న భవనంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం ఇదివరకే ఆదేశాలు ఇచ్చారు. ఓ ప్రైవేటు ఆస్పత్రి లీజుకు తీసుకున్న హోటల్లో కొవిడ్ పేషెంట్లను ఉంచగా, అందులో అగ్నిప్రమాదం సంభవించి 9 మంది మరణించిన ఘటనపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.