ETV Bharat / state

కె.విశ్వనాథ్ సినిమాలకు ముగ్దుడై.. 'విశ్వనాథ్ విశ్వరూపం' పుస్తకానికి శ్రీకారం - తెలంగాణ తాజా వార్తలు

'కళా తపస్వి కె.విశ్వనాథ్ సినీ రంగానికే ఆదర్శం. ఆయన తీసిన సినిమాలు ఎంతో ప్రత్యేకం' అని ఆర్బీఐ విశ్రాంత ఉన్నతోద్యోగి డాక్టర్​ రామశాస్త్రి అన్నారు. చిన్ననాటి నుంచి.. కె.విశ్వనాథ్ గురించి, ఆయన సినిమాల గురించి తెలుసుకొని ముగ్దుడైన ఆయన ఏకంగా ఓ పుస్తకాన్నే రచించాడు. "విశ్వనాథ్ విశ్వరూపం" పేరుతో రచించిన పుస్తకాన్ని కె.విశ్వనాథ్ చేతుల మీదుగానే ఆవిష్కరింపజేశారు.

విశ్వనాథ్ విశ్వరూపం పుస్తకం
విశ్వనాథ్ విశ్వరూపం పుస్తకం
author img

By

Published : Oct 15, 2021, 4:56 PM IST

Updated : Oct 15, 2021, 8:33 PM IST

సినిమా అంటే కేవలం వినోదం కాదు.. కళలకు ప్రాధాన్యం, సామాజిక స్పృహ కల్పించేలా సన్నివేశాలు తీయడం, సాహిత్యానికి పెద్దపీట. వీటన్నింటికి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో సమ ప్రాధాన్యం ఉంటుంది. ఆయన సినిమాలు చూసి ప్రేక్షకులు తన్మయత్వంలో మునిగిపోతారు. శంకరాభరణం, సాగర సంగమం, స్వాతి కిరణం, స్వర్ణకమలం, శుభ సంకల్పం, సిరివెన్నెల ఇలా ప్రతి సినిమా ప్రేక్షకుడి మదిలో చెరగని ముద్ర వేసింది.

viswanath vishwaroopam
పుస్తక రచయిత డాక్టర్​.రామశాస్త్రితో కె. విశ్వనాథ్​

కె. విశ్వనాథ్​కు వీరాభిమాని..

అలా చిన్నప్పటి నుంచి కె.విశ్వనాథ్ సినిమాలు చూసి ఆయనకు వీరాభిమానిగా మారారు డాక్టర్ రామశాస్త్రి. విశ్వనాథ్ సినిమాను తన 13వ ఏట చూసిన రామశాస్త్రి.. ఒక్కో చిత్రాన్ని ఒక్కసారితో వదలిపెట్టకుండా మరల మరల చూస్తూ మంత్ర ముగ్దుడైపోయారు. అలా ప్రతి సినిమా చూస్తూ జీవితంలో ఎంతో నేర్చుకున్నారు. ఆర్బీఐలో చీఫ్​ జనరల్​ మేనేజర్​గా చేస్తూ... పదవీ విరమణ పొందిన రామశాస్త్రి 2017లో కె.విశ్వనాథ్​పైనే ఓ పుస్తకం రాయాలని నిర్ణయించుకున్నారు. కె.విశ్వనాథ్ అంగీకారంతో... ఆయనపై రాసిన పుస్తకంలో ఎన్నో అంశాలను పొందుపర్చారు. "విశ్వనాథ్ విశ్వరూపం" పేరుతో రచించిన పుస్తకాన్ని కె.విశ్వనాథ్ చేతుల మీదుగానే ఆవిష్కరింపజేశారు.

viswanath vishwaroopam
విశ్వనాథ్​ విశ్వరూపం పుస్తకావిష్కరణ

సాహిత్యంపై మక్కువతో..

ఓ వైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ.. సాహిత్యంపై మక్కువతో కె.విశ్వనాథ్ సినిమాలను తరచూ చూసేవారు రామశాస్త్రి. సమయం దొరికినప్పుడల్లా భార్యతో కలిసి సినిమాకు వెళ్లి... అందులోని కళలను, సందేశాన్ని విశ్లేషించేవారు. ఆర్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్​గా పదవీ విరమణ పొందిన తర్వాత కూడా పలు బ్యాంకులకు డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. వృత్తిలో బిజీగా ఉన్నప్పటికీ.. కె.విశ్వనాథ్ సినిమాల పట్ల ఉన్న మక్కువ ఏమాత్రం తగ్గలేదు. కె.విశ్వనాథ్​పై పుస్తకాన్ని రచించాలనుకున్న రామశాస్త్రి నిర్ణయాన్ని ఆయన భార్య గాయత్రి దేవి వెన్నుతట్టి ప్రోత్సహించారు. భార్య గాయిత్రి దేవీ వృత్తిరీత్యా ఆయుర్వేద వైద్యురాలైనప్పటికీ... ఆమె కూడా రచనలు చేస్తుండటంతో.... రామశాస్త్రి రచనలకు తోడ్పాటునందించారు. రామశాస్త్రి 4 నెలల పాటు పూర్తి సమయాన్ని కేటాయించి పుస్తకాన్ని పూర్తి చేశారు. పలు సందర్భాల్లో విశ్వనాథ్ సినిమాలను మళ్లీ మళ్లీ చూసి అందులో సందర్భాలను విశ్లేషించి పుస్తకంలో పొందుపర్చారు. కె.విశ్వనాథ్ సినిమాల్లో ఎక్కువగా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. శంకరాభరణం, ఉండమ్మా బొట్టు పెడతా, సాగర సంగమం సినిమాల్లోనూ ప్లాష్ బ్యాక్​ను రామశాస్త్రి తన పుస్తకంలో ప్రస్తావించారు. కళలకు కె. విశ్వనాథ్​ ఇచ్చిన ప్రాధాన్యాన్ని.. పాటలు, కథానాయిక వ్యక్తిత్వానికి ఇచ్చిన ప్రాధాన్యతను తన పుస్తకంలో రామశాస్త్రి ప్రస్తావించారు.

విశ్వనాథ్ విశ్వరూపం పుస్తకానికి ముఖచిత్రాన్ని రామశాస్త్రి కుమార్తె అపరాజిత గీశారు. కంప్యూటర్ సైన్సులో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన అపరాజిత అమెరికా ఉద్యోగం చేస్తూ... మూడేళ్ల క్రితం హైదరాబాద్​కు వచ్చేశారు. హైదరాబాద్​లోనే సాఫ్ట్​వేర్​ కంపెనీ ఏర్పాటుచేసుకొని బిజీగా ఉన్నా...విశ్వనాథ్​పై ఉన్న అభిమానంతో ఎంతో కష్టపడి చిత్రాన్ని గీశారు.

కె.విశ్వనాథ్ సినిమాలకు ముగ్దుడై.. 'విశ్వనాథ్ విశ్వరూపం' పుస్తకానికి శ్రీకారం

నా కోసమే తపస్సు చేసినట్లుంది: కె. విశ్వనాథ్

రామశాస్త్రి పుస్తకాన్ని చదివిన కె.విశ్వనాథ్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. పుస్తకాన్ని చదువుతుంటే ప్రస్తుతం తన చిత్రాలను తానే చూసుకున్నట్లుందంటూ రామశాస్త్రిని అభినందించారు.

'విశ్వనాథ్​ విశ్వరూపం' పుస్తకం చూస్తే నా మతిపోయింది. నా సినిమాలో ఇన్ని విశేషాలున్నాయా.. అనిపించింది. నాకోసమే తపస్సు చేసినట్లుగా ఉంది. పుస్తకం రాసేందుకు ఎన్నిసార్లు నా సినిమాలు చూశారో..

- కె. విశ్వనాథ్​​, ప్రముఖ దర్శకుడు

'కె. విశ్వనాథ్​ సినిమాలు చేస్తుంటే వాటిపై ఆసక్తి పెరిగింది. 2017 ఓ కార్యక్రమంలో కె.విశ్వనాథ్​ను కలిశాను. అప్పుడే వారికి చెప్పాను.. ఆయనపై ఓ పుస్తకం రాస్తానని. కొద్దిరోజుల తర్వాత రాసిన పుస్తకాన్ని ఆయనకు తీసుకెళ్లి చూపించా.. ఆయన ఆశీస్సులు రాసిచ్చారు.

- డాక్టర్​. రామశాస్త్రి, పుస్తక రచయిత

'కీర్తి అంటే మనం సంపాదించుకొనేది.. యశస్సు అంటే తనంతట తాను వరించి వచ్చేది. కె. విశ్వనాథ్​ది యశస్సు. ఆయన సినిమాలు చూసి పరిశీలించి, పరామర్శించి, పరవశించి పుస్తకం రాసేందుకు ఎంతో ఇష్టం, కమిట్​మెంట్​ ఉండాలి.

- తనికెళ్ల భరణి, సినీనటుడు, దర్శకుడు

ఇదీచూడండి: Vijayadashami 2021: నవరాత్రుల వేళ అమ్మవారు ఎక్కడ కొలువై ఉంటుందో తెలుసా..?

Last Updated : Oct 15, 2021, 8:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.