విశాఖ డెయిరీ సంక్రాంతి బోనస్‌గా పాడి రైతులకు 35 కోట్ల రూపాయలు ప్రకటించింది. డెయిరీ పరిధిలోని 5 జిల్లాల్లో పాలు సరఫరా చేసే రైతులకు ఈ సొమ్ముపంపిణీ చేసింది. డెయిరీ పరిధిలో లక్షా 40 వేల మంది రైతులు నుంచి లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్నారు.
పాడి రైతులను ఆదుకోవడం కోసం భారీ మొత్తాన్ని బోనస్‌గా ఇచ్చామని విశాఖ డెయిరీ వైస్ ఛైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ చెప్పారు. ఎలమంచిలి పాడి రైతులకు చెక్కుల పంపిణీతో కార్యక్రమాన్ని ఆరంభించారు.
గేదె పాలకు లీటర్‌కి రెండు రూపాయల ధర పెంచుతున్నట్టు విశాఖ డెయిరీ ప్రకటించింది. రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి పాడి రైతుకి సంక్రాంతి పురస్కరించుకుని స్టీల్ గిన్నెలు ఉచితంగా అందించారు.
ఇదీ చదవండి: 'గల్వాన్‌లో బుద్ధి చెప్పాం.. ఇంకా సహనాన్ని పరీక్షించొద్దు'