మాజీ ఎంపీ దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ భాజపాలో చేరారు. దిల్లీలో పార్టీ పెద్దలు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. గోదావరి నీటిని శ్రీశైలానికి తరలించాల్సిన అవసరం ఏముంది ప్రశ్నించారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ నాయకులతో సోమేశ్‌కుమార్ కమిటీ చర్చలు