ఆంధ్రప్రదేశ్ విజయనగరంలోని ఏడు కోవెళ్ల ప్రాంగణంలో నెలకొల్పిన మట్టి వినాయకున్ని అదే చోట నీటితో నిమజ్జనం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకున్ని ఆలయ కమిటీ వారు ప్రతిష్ఠించారు. నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు అందించారు. చివరి రోజు ఘనంగా అభిషేకాలు నిర్వహించి.. ప్రతిష్ఠించిన ప్రాంతంలోనే నిమజ్జనం చేశారు. అగ్నిమాపక యంత్రంతో నిర్వహించిన వినాయక నిమజ్జన కార్యక్రమానికి పరిసర ప్రాంతాల ప్రజలు పాల్గొని తిలకించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగానే మట్టితో వినాయకున్ని రూపొందించి.... ఇక్కడే నిమజ్జం చేశామని ఏడు కోవెల ప్రధాన అర్చకుడు తెలియచేశారు.
ఇవీ చూడండి: గణేశుడి ముందు చిందులేసిన ట్రాఫిక్ పోలీసులు!