ETV Bharat / state

CARRIED DEAD BODY IN PADERU : అడుగు కూడా వేయలేని ఆ దారిలో 6 కిమీ దూరం మృతదేహాన్ని మోసుకెళ్లారు! - ap news

ఏపీలోని విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో.. రహదారుల దుస్థితికి అద్దం పడుతున్న వార్త ఇది. రోడ్ల అనుసంధానం లేకపోవడంతో.. ఓ మృతదేహాన్ని ఆరు కిలోమీటర్ల మేర (CARRIED DEAD BODY IN PADERU) మోసుకెళ్లారు. ఇదే మహిళను రెండు రోజుల కిందట చికిత్స నిమిత్తం అదే బాటలో డోలీలో మోసుకుని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

CARRIED DEAD BODY IN PADERU
CARRIED DEAD BODY IN PADERU
author img

By

Published : Nov 28, 2021, 10:41 PM IST

CARRIED DEAD BODY IN PADERU: ఓ మహిళ మృతదేహాన్ని డోలీలో 6 కిలోమీటర్లు మోసుకెళ్లిన ఘటన.. ఏపీలోని విశాఖ జిల్లాలోని పాడేరు ఏజెన్సీలో జరిగింది. పాడేరు మండలం కాంగుగెడ్డకు చెందిన మూడు నెలల బాలింత రెండు రోజుల క్రితం పక్షవాతానికి గురైంది. ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు రహదారి లేకపోవడంతో 6 కిలోమీటర్ల మేర డోలీలో మోసుకుని, మాడుగుల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అత్యవసర చికిత్స నిమిత్తం.. ఆ మహిళను అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్​కు తరలించారు.

అయితే.. చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందింది. అంబులెన్స్​లో మృతదేహాన్ని రహదారి మార్గం వరకు (CARRIED DEAD BODY IN PADERU) తీసుకొచ్చారు. ఆక్కడి నుంచి వాహనం ముందుకు కదిలే అవకాశం లేకపోవడంతో.. మృతదేహాన్ని చాపలో చుట్టి, కర్రకు కట్టి అత్యంత కష్టం మీద గ్రామానికి చేర్చారు. రోడ్డులేని కష్టాల దారిలో తమ దుస్థితి నిత్యం ఇలాగే ఉంటోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి పాడేరు మండలం దేవాపురం నుంచి మాడుగుల వరకు రహదారి నిర్మించాలని కోరుతున్నారు. తమ గ్రామాలకు చేరుకునేందుకు వీలుగా రోడ్డు మార్గాన్ని నిర్మించాలని, అధికారులు దీనిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అడుగు కూడా వేయలేని ఆదారిలో 6 కిలోమీటర్లు దూరం మృతదేహాన్ని మోసుకెళ్లారు

ఇదీ చూడండి: Heat water from well: ఆ బావిలో నాలుగు నెలలుగా వేడినీళ్లు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.