ETV Bharat / state

'భూ​ వివాదంలో తలదూరుస్తున్న కార్పొరేటర్​పై చర్యలు తీసుకోండి'

ఓ భూ వివాదంలో తలదూర్చిన తెరాస కార్పొరేటర్​పై చర్యలు తీసుకోవాలని బాధితుడు.. మంత్రి కేటీఆర్​ను వేడుకున్నాడు. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన స్థలంలో తన సోదరుడు ఇంటి నిర్మాణం చేపట్టాడని బాధపడ్డాడు. ఈ విషయంపై సిటీ సివిల్​ కోర్టు స్టే ఇచ్చినా.. కార్పొరేటర్​ ప్రోద్బలంతో ఈ నిర్మాణం సాగిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. కోర్టు ఆర్డర్స్​ను అమలు చేసి సివిల్ వివాదంలో తలదూరుస్తున్న కార్పొరేటర్​పై చర్యలు తీసుకోవాలని బాధితుడు వేడుకున్నాడు.

'భూ​ వివాదంలో తలదూరుస్తున్న కార్పొరేటర్​పై చర్యలు తీసుకోండి'
'భూ​ వివాదంలో తలదూరుస్తున్న కార్పొరేటర్​పై చర్యలు తీసుకోండి'
author img

By

Published : Oct 10, 2020, 3:12 PM IST

ఓ భూ వివాదంలో తలదూర్చిన తెరాస కార్పొరేటర్​పై చర్యలు తీసుకోవాలని బాధితుడు.. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ను వేడుకున్నాడు. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ ప్రాంతానికి చెందిన ముత్యాలు, అతని సోదరుడు శంకర్​కు తల్లిదండ్రుల నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న 54 గజాల స్థలం సంక్రమించినట్లు తెలిపారు. అయితే తనకు రావాల్సిన 27 గజాల భూమిని తనకు ఇవ్వకుండా.. ఆ స్థలంలో తన అన్న ఇంటి నిర్మాణం చేపట్టాడని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ విషయంపై సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించానని.. ఆ స్థలంలో నిర్మాణం చెపట్టకూడదని కోర్టు స్టే ఇచ్చినట్లు ముత్యాలు పేర్కొన్నాడు. కోర్టు స్టే ఉన్నప్పటికీ స్థానిక తెరాస మొండా మార్కెట్ కార్పొరేటర్ ఆకుల రూప ప్రోద్బలంతో.. తన సోదరుడు నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారని తెలిపాడు. జీహెచ్ఎంసీ అధికారుల చుట్టూ తిరిగినా తనకు న్యాయం జరగడం లేదన్నాడు. కోర్టు ఆర్డర్స్​ను అమలు చేసి సివిల్ వివాదంలో తలదూరుస్తున్న కార్పొరేటర్​పై చర్యలు తీసుకోవాలని బాధితుడు వేడుకున్నాడు.

ఇదీ చదవండి: భూ వివాదం: కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్న ఇరువర్గాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.