సంపూర్ణ ఆరోగ్యం ఉన్నవారే నిజమైన భాగ్యవంతులని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ముచ్చింతల్‌లో కిమ్స్ ఆసుపత్రి సహకారంతో స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఉచిత వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ తమిళి సౌందరరాజన్ తొలిసారి తెలుగులో మాట్లాడి ఆశ్చర్యపరిచారు. డాక్టర్‌గా స్వర్ణభారత్ ట్రస్ట్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రెండు, మూడువారాల్లో వెంకయ్య ఆశీస్సులతో పూర్తిగా తెలుగులో మాట్లాడతానని వెల్లడించారు. పేదలకు వైద్య సేవలు అందించడం చాలా గొప్పవిషయమని అభిప్రాయపడ్డారు. ఖరీదైన వైద్యాన్ని పేదలకు చేరవేస్తున్న స్వర్ణ భారత్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని కొనియడారు. పట్టణాల్లో పనిచేసే వైద్యులు వారంలో ఒకరోజు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని వెంకయ్యనాయుడు సూచించారు.
ఇవీచూడండి: హుజూర్నగర్ ఉపఎన్నికల్లో కోదండరాం మద్దతు కోరిన ఉత్తమ్