ETV Bharat / state

'అంబేడ్కర్​ విగ్రహాన్ని పెట్టకుంటే ఆమరణ దీక్ష' - కాంగ్రెస్​ నేత

భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్​కే అవమానం జరిగితే తెరాస నాయకులు కనీసం స్పందించలేదని వీహెచ్​ విమర్శించారు. రెండో విడత ఎన్నికల తర్వాత విగ్రహం కూల్చిన చోట కొత్తది పెట్టాలని డిమాండ్​ చేశారు. లేకుంటే ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరించారు.

వి హనుమంతురావు
author img

By

Published : May 7, 2019, 4:24 PM IST

రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పంజాగుట్టలో కూల్చిన అంబేడ్కర్​ విగ్రహాన్ని తిరిగి పెట్టాలని కాంగ్రెస్​ సీనియర్​ నేత హనుమంతురావు డిమాండ్​ చేశారు. లేకుంటే తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ప్రాణాలు పోయినా అంబేడ్కర్​ ఆశయ సాధన కోసం పోరాడతానని స్పష్టం చేశారు. రాజ్యాంగ నిర్మాతకే అవమానం జరిగితే ప్రజాస్వామ్యంలో న్యాయం ఎక్కడుందని ప్రశ్నించారు. చనిపోయిన ఇంటర్​ విద్యార్థుల కుటుంబాలను కలిసేందుకు సమయం లేని కేసీఆర్​కు కేరళ సీఎంను కలిసేందుకు సమయం ఉందా అని ఎద్దేవా చేశారు.

అంబేడ్కర్​ ఆశయాలకు కృషి చేస్తానంటున్న వీహెచ్​

ఇదీ చూడండి : ఈ నెల 28న తెలంగాణ మంత్రిమండలి భేటీ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.