హైదరాబాద్లో 120 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆక్షేపించారు. గాంధీభవన్లో మాట్లాడిన ఆయన తాము ఏర్పాటు చేయదలచుకున్న రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని పోలీస్స్టేషన్లో పెట్టడాన్ని దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. దీనిపై నిరసన తెలిపితే తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. కేసులకు భయపడేది లేదని అన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా... అనే అనుమానం కలుగుతుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలపై ఉత్తమ్ స్పందన