నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు డిమాండ్ చేశారు. ఓవైపు ప్రపంచమంతా కరోనాతో కొట్టుమిట్టాడుతుంటే.. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలపై అన్వేషణ ప్రారంభమైందని ఆరోపించారు.
గత నెల 23న కేంద్రం నుంచి తెలంగాణకు లేఖ రాగా.. అందులో నల్లమల అటవీ ప్రాంతంలో జంతువులు, వృక్షాలు తదితర వివరాలు కోరారని వివరించారు. కేసీఆర్ నల్లమలలో యురేనియం తవ్వకాలు జరగనివ్వబోమని చెబుతుండగా.. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ యురేనియం తవ్వకాలు ఆగవని అంటున్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని వీహెచ్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: వలస కూలీలను ఫోన్ నంబర్‌తో పట్టేస్తారు