రాష్ట్రంలో వెంటిలేటర్ల సంఖ్యను పెంచేదిశగా కృషిచేస్తున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున రాష్ట్రానికి వెయ్యి వెంటిలేటర్స్ ఇవ్వాల్సిందిగా.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు వివరించారు.
బీఆర్కే భవన్‌లో మంత్రి ఈటలను కలిసిన మైక్రాన్ సంస్థ ప్రతినిధులు 100 వెంటిలేటర్లను ప్రభుత్వ ఆస్పత్రులకు... ఉచితంగా అందించారు. వివిధ కారణాలతో వాడకుండా ఉన్న వాటిని వినియోగంలోకి తీసుకువస్తున్నట్టు తెలిపిన ఈటల. రాష్ట్రంలో భారీగా వెంటిలేటర్స్‌ని అందుబాటులోకి తెచ్చేందుకు డీఆర్డీఓ సహకారం అందించేందుకు ముందుకు వచ్చిందని వివరించారు.
ఇవీ చూడండి: కరోనా కేసుల పెరుగుదలకు కారణాలివే!