ETV Bharat / state

'వ్యవసాయ రంగాన్ని కాపాడుకునేందుకు అందరి కృషి అవసరం' - వ్యవసాయంపై వెంకయ్య నాయుడు

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే బాధ్యత పరిశోధనా సంస్థలు, పరిశ్రమలపై ఉందన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. హైదరాబాద్‌లోని జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీలో ఏర్పాటు చేసిన వ్యవసాయ సదస్సులో ఆయన కీలక ఉపన్యాసం చేశారు. దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతున్నా.. వ్యవసాయ రంగం మాత్రం వెనకబడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను కాపాడుకునేందుకు శాస్త్రవేత్తలు, పరిశ్రమ వర్గాలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

venkaiah-naidu-at-agritech-south-2020-held-in-hyderabad
వ్యవసాయ రంగంలో వెనకబడే ఉన్నాం: వెంకయ్యనాయుడు
author img

By

Published : Feb 22, 2020, 12:43 PM IST

Updated : Feb 22, 2020, 2:48 PM IST

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 'అగ్రిటెక్ సౌత్-2020' సదస్సు ప్రారంభమైంది. మూడురోజుల పాటు జరిగే ఈ సదస్సులో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో మంత్రులు మహమూద్ అలీ, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.

దేశంలో వ్యవసాయ రంగంలో అనేక సవాళ్లు వేధిస్తున్నాయని వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయని అయితే... అన్నదాతల కోసం ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని తెలిపారు. ఈ రంగాన్ని రక్షించుకునేందుకు శాస్త్రవేత్తలు, పరిశ్రమ వర్గాలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

దేశంలో నేటికీ 50 శాతం మందికే బ్యాంకు రుణాలు అందుతున్నాయని మిగిలిన వారంతా ప్రైవేటు సంస్థలను ఆశ్రయిస్తున్నారని ఆయన వాపోయారు. రుణమాఫీ అనేది రైతులకు తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీర్ఘకాలిక పరిష్కారం చూపాల్సిన అవసరముందని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.

వ్యవసాయ రంగంలో వెనకబడే ఉన్నాం: వెంకయ్యనాయుడు

ఇదీ చదవండిః అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేయాలి: వెంకయ్యనాయుడు

Last Updated : Feb 22, 2020, 2:48 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.