సికింద్రాబాద్ కంటైన్మంట్లోని ఏ ఒక్కరూ ఆకలితో అలమటించొద్దనే ఉద్దేశంతో తాము ఆహారం ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నట్లు వాసవీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు తేలు కుంట సతీష్ గుప్త తెలిపారు. కంటోన్మెంట్లోని 200 మంది నిరుపేదలకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు డిప్యూటీ సీఈఓ విజయ్ కుమార్ హాజరయ్యారు. పేద ప్రజల కోసం వెల్ఫేర్ అసోసియేషన్ చేస్తున్న కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని ఆయన కొనియాడారు.
ఇదీ చూడండి: హడలెత్తిస్తున్న కరోనా.. 1000కి చేరువలో కేసులు