సికింద్రాబాద్ వాసవి నగర్‌లో వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీలో ఉంటున్న పేద కుటుంబాలకు నిత్యావసరాలు అందజేశారు. దాదాపు 30 నిరుపేద కుటుంబాలను గుర్తించి... పది రోజులకు సరిపోయే సరుకులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్ ముగిసే వరకు పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తానని అసోసియేషన్ అధ్యక్షుడు తెలిపారు.
ఇదీ చూడండి: మారుతున్న జీవనశైలితో సామాజిక చైతన్యం స్థిరపడేనా