'వాల్యుర్ డే' సందర్భంగా శామీర్‌పేట్‌లోని సీఆర్పీఎఫ్ రెండో బెటాలియన్ క్యాంపస్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఐజీపి సీఆర్పీఎఫ్ రంగారెడ్డి గ్రూప్ సెంటర్ బ్రజేష్ సింగ్ సైన్యం సేవలను కొనియాడారు.
1965లో గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో సర్దార్పొస్టు వద్ద భారత సైనికుల స్థావరాలపై పాకిస్తాన్ బ్రిగేడ్లు దాడిని తిప్పికొట్టిన సైనికుల వీరత్వాన్ని కొనియాడారు. ఆనాటి జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. బెటాలియన్‌లో కొవిడ్ కేసులు పెరుగుతున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కమాండెంట్ సునీల్ కుమార్, సహయ కమాండెంట్లు తులసి, రత్నమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఏప్రిల్ నుంచే ప్రైవేటు టీచర్లకు సాయం