హైదరాబాద్ నగరం నడిబొడ్డునున్న ఇందిరాపార్కులో మూడు రోజుల క్రితం అర్ధరాత్రి 13 శ్రీగంధం చెట్లను నరికారు. ఆటోలో దుంగలను తరలించుకుపోయారు. లక్షలాది రూపాయలు విలువ చేసే చెట్ల నరికివేత ఇంటి దొంగల పనే అని ఇందిరాపార్కు వాకర్లు ఆరోపిస్తున్నారు. పార్కును రక్షించాలంటూ వాకర్స్ ధర్నా దిగారు. పార్కుకు రక్షణ లేకుండా పోతుందన్నారు. శ్రీగంధం చెట్లు నరికిన వారిని పట్టుకోవాలని డిమాండ్ చేశారు.
చెట్ల నరికివేతతో పార్కుకు వచ్చే వారు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. భద్రత కోసం నిఘా నేత్రాలు ఏర్పాటు చేయాలని చాలా సంవత్సరాలుగా జీహెచ్‌ఎంసీని అభ్యర్థిస్తున్నా స్పందన కరువైందని చెప్పారు. స్మగ్లర్లకు పరోక్షంగా సహకరించిన ఉద్యాన సిబ్బందిని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఇందిరా పార్కులో అర్ధరాత్రి.. 13 శ్రీగంధం చెట్ల నరికివేత