రాష్ట్రవ్యాప్తంగా కురుస్తోన్న వర్షాలకు పశుసంపద అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని పశు సంవర్ధక శాఖ సంచాలకులు డా.వి.లక్ష్మారెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి పశువుల్లో వ్యాధులు రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వివిధ రకాలైన పశు వ్యాధులు ముఖ్యంగా గొంతు, జబ్బ వాపు, గాలి కుంటు.. అలాగే చిన్న జీవాల్లో ఫుట్ రాట్, నీలి నాలుక వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సీజనల్ రోగాలైన గొంతు, జబ్బులు వాపు, గాలి కుంటు వ్యాధులకు టీకాలు ఇవ్వడం జరిగిందన్నారు.
పశువులన్నింటికి సరిపడే టీకాలు జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఇంకా అవసరమైతే జిల్లా పశువైద్యాధికారులు హైదరాబాద్లోని వి.బి.ఆర్.ఐ నుంచి తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో పశు సంపదకు ప్రాణ, ఆస్తి నష్టంపై వెంటనే రాష్ట్ర డైరెక్టరేటులో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఇదీ చూడండి : వరుణాగ్రహం: భద్రాద్రిలో 59 అడుగులకు చేరిన నీటిమట్టం