ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్ కమిషనర్‌గా కొనసాగుతున్న నిమ్మగడ్డ రమేష్‌ను పదవి కాలంలో ఉండగానే తొలగించడమనేది ప్రజాస్వామికంగా సరైందికాదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అభిప్రాయపడ్డారు. వైకాపాకి చెందిన కొంతమంది నాయకులు జ్యుడిషియరీపైన కామెంట్లు చేస్తూ ఆ పార్టీకి చెడ్డ పేరు తీసుకువస్తున్నారన్నారు.
లాక్డౌన్ సడలింపులతో తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం పెరుగుతున్నా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల్లో కోత పెట్టడాన్ని వీహెచ్ ఖండించారు. పోతిరెడ్డిపాడు నుంచి 800 క్యూసెక్కుల నీటిని ఏపీకి తరలించుకుపోతే దక్షిణ తెలంగాణ ఎడారైపోతుందనే విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు.
ఇవీ చూడండి : మిడతల రోజూ ప్రయాణం 130 కిలోమీటర్లు.. ఆ జాగ్రత్తలు పాటించాలి!