పార్టీ కోసం 24 గంటలు శ్రమించిన కార్యకర్తలకు కాకుండా డబ్బులున్న వాళ్లకి సీట్లు ఇవ్వడం వల్లే వాళ్లు పార్టీ ఫిరాయించారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. 20 కోట్లు ఉన్నవారికి సీట్లిచ్చి వారినే గెలవమనడం కాదు.. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు సీట్లిచ్చి వారి కోసం పార్టీ డబ్బు ఖర్చు పెట్టాలని తెలిపారు. అప్పుడే వాళ్లు విశ్వాసంగా పార్టీ కోసం పనిచేస్తూ... పార్టీలో ఉంటారని హనుమంతరావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో బీ ఫారాలు అందుకొని, పార్టీ తరఫున గెలిచి తెరాసకు వెళ్లడమంటే... పార్టీనే కాదు ఓటేసిన ప్రజలను కూడా మోసం చేసినట్లేనని హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: పాఠశాలలో అగ్ని ప్రమాదం- ముగ్గురు మృతి