125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు(V. Hanumantha Rao) తెలిపారు. అదేవిధంగా పంజాగుట్ట చౌరస్తాలో విగ్రహాన్ని పున:ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ అంబర్‌పేట్‌లోని ఆయన నివాసంలో అంబేడ్కర్ విగ్రహ పున:ప్రతిష్ఠ చేయాలని పోస్టర్ రిలీజ్ చేశారు. గణేశ్ నవరాత్రుల సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రభుత్వ, ప్రజా సమస్యలపై స్పందిస్తున్న జస్టిస్ రమణకు లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు. అన్ని పార్టీలు ఈ సమస్యపై స్పందిస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ సమస్య పై స్పందించకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో భట్టి విక్రమార్క ఈ సమస్య లేవనెత్తాలని ఆయన కోరారు. గణేశ్ నిమజ్జనం లోపు ప్రభుత్వం విగ్రహ ప్రతిష్ఠ చేయకపోతే ఊరూరా తిరుగుతూ పోరాటం చేస్తానని ఆయన వెల్లడించారు.
గణపతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ వేడుకలు ఇవాళ్టివి కావు. పెళ్లిళ్లు అయినా, ఏదైనా మొదలు గణపతి పూజలు చేస్తాం. మూడేళ్ల కిందట పంజాగుట్ట చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అక్కడ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఉంది. అందుకు ఎవరి అనుమతులు లేవు. రోడ్డు బ్లాక్ లేదు. కానీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎదురగానే విగ్రహం ఏర్పాటు చేస్తున్నప్పుడు.. ఏప్రిల్ 12 నుంచి మొదలుపెట్టారు. సీఐ, ఎస్సై ఉన్నారు. ఎవరు ఏం అనలేదు. ఏప్రిల్ 13నాడు విగ్రహం ధ్వంసం చేశారు. అసెంబ్లీలో ప్రస్తావించాలని భట్టి విక్రమార్కను రిక్వెస్ట్ చేశా. కానీ చేయలేదు.-వి హనుమంతరావు, మాజీ రాజ్యసభ సభ్యులు
ఇదీ చదవండి: KTR: బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ను ఏవియేషన్ వర్సిటీగా మార్చాలి