ETV Bharat / state

ఇప్పటి వరకు ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: వీహెచ్​

author img

By

Published : Oct 13, 2019, 10:57 AM IST

ఆర్టీసీ కార్మికులెవరూ ప్రాణత్యాగం చేసుకోవద్దని కాంగ్రెస్​ సీనియర్​ నేత వి.హనుమంతరావు అన్నారు. ఆత్మహత్యకు యత్నించి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆర్టీసీ డ్రైవర్​ శ్రీనివాస్​ రెడ్డిని ఆయన పరామర్శించారు. తక్షణమే ప్రభుత్వం.. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ఇప్పటి వరకూ ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదని ఆక్షేపించారు.

ఆత్మహత్యకు యత్నించిన ఆర్టీసీ డ్రైవర్​ను పరామర్శించిన వీహెచ్​

డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు బలిదానం చేసుకోవద్దని కాంగ్రెస్​ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. కార్మికుల తరఫున తామంతా పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వ తీరుపై మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆర్టీసీ డ్రైవర్ డి.శ్రీనివాస్​​ రెడ్డిని ఆయన పరామర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్​ నియంత పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇలాంటి అణచివేత ధోరణికి ఎప్పుడూ పాల్పడలేదని... ఒకప్పుడు కార్శిక శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి కార్మిక యూనియన్లను పెట్టొద్దంటున్నారని ఆక్షేపించారు.

ఇప్పటి వరకు ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: వీహెచ్​

'ఇదీ చూడండి: బలిదానాలొద్దు.. అవసరమైతే బలి కోరదాం'

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.