ETV Bharat / state

సీఎం కేసీఆర్​కు ఉత్తమ్​కుమార్​రెడ్డి లేఖ

సీఎం కేసీఆర్​కు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ​కుమార్​రెడ్డి లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులను కూలీల సొంత గ్రామాల్లో చేపట్టాలని కోరారు.

uttam kumar
uttam kumar
author img

By

Published : May 22, 2021, 9:23 PM IST

కరోనా నేపథ్యంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులను కూలీల సొంత గ్రామాల్లో చేపట్టాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. కరోనా కాలంలో కూలీలు రోజుకు కనీసం 7 నుంచి 8 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి పని ప్రదేశానికి వెళుతున్నారని చెప్పారు. ఈ ప్రయాణం అత్యంత ప్రమాదకరమైన రీతిలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డితో కలిసి ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు.

ఒకే ఆటోలో కనీసం 14 నుంచి 15 మంది, ట్రాక్టర్‌లో 100 మంది వరకు ప్రయాణం చేస్తున్నారని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో పాటించాల్సిన రక్షణ పద్ధతులు ఏమీ అనుసరించకపోవడం వల్ల వైరస్ సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితుల్లో సొంత గ్రామాల్లో పనులు కల్పిస్తే కూలీలు సామూహికంగా ప్రయాణం చేసే అవకాశం ఉండదన్నారు. పనులు జరిగే ప్రాంతంలో భౌతిక దూరం, శానిటైజర్లు, మాస్క్‌లు ధరిస్తారని చెప్పారు. ఈ దిశగా ముఖ్యమంత్రి... తగిన చర్యలు తక్షణమే చేపట్టాలని ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: 'ఐడీ కార్డులు చూడకుండా పోలీసులు లాఠీలకు పని చెప్పొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.