వలస కూలీల పరిరక్షణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ముందుచూపు లేకుండా ప్రణాళికారహితంగా విధించిన ఆంక్షలతో వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. కూలీలకు ఆహారం, ఆశ్రయం, భద్రత విషయంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని దుయ్యబట్టిన ఉత్తమ్.. ఇప్పటికీ లాక్‌డౌన్‌పై సరైన కార్యాచరణ లేకపోవడం శోచనీయమని ధ్వజమెత్తారు.
"వలస కూలీల పరిరక్షణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి. ముందుచూపు లేకుండా విధించిన లాక్‌డౌన్‌తో వలసకూలీలకు ఎన్నో కష్టాలు తలెత్తాయి. ఆహారం, ఆశ్రయం, భద్రత విషయంలో ప్రధాని, సీఎం వైఫల్యం చెందారు."
-ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
ఇదీ చూడండి: భారత 'జ్యోతి'కి ఇవాంకా ట్రంప్ సలాం!