రాష్ట్రంలో ఎల్‌ఆర్ఎస్‌ను ఎవరూ చేయించుకోవద్దని.. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్ చేస్తామని స్పష్టం చేశారు. జూమ్ యాప్ ద్వారా ఎల్ఆర్ఎస్పై ఆయన, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ నాయకులతో చర్చించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపుకోడానికే ఎల్ఆర్ఎస్‌ను తీసుకొచ్చిందని ఆరోపించారు. "నో ఎల్‌ఆర్‌ఎస్.. నో తెరాస'' నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఆస్తులకు రిజిస్ట్రేషన్ నాటి విలువ ఆధారంగా ఎల్ఆర్ఎస్ రుసుం ఉంటుందని శాసన సభాముఖంగా మంత్రి కేటీఆర్ చెప్పినా... అది అమలు చేయట్లేదని ధ్వజమెత్తారు.
ప్రజల ఆస్తుల వివరాలు గ్రామ పంచాయతీ రికార్డుల్లో ఉన్నప్పటికీ.. మళ్లీ సర్వే ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని జీవన్ రెడ్డి అన్నారు. పన్నుల భారం మోపేందుకే సర్వేలు చేస్తున్నారా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. న్యాయస్థానంలో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తప్పదని హెచ్చరించారు.
ఇదీ చూడండి : ధరణి పోర్టల్ నిర్వహణ కోసం శనివారం నుంచి శిక్షణ