USPC ON Teachers Transfer issue : 317 జోవోను సవరించి ఉపాధ్యాయుల అప్పీళ్లను పరిష్కరించాలని యూఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ విషయమై జనవరి 3,4 తేదీల్లో ఆయా నియోజకవర్గాల్లోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిసి వినతిపత్రాలు సమర్పించనున్నట్లు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ప్రకటించింది.
యూఎస్పీసీ భాగస్వామ్య సంఘాల జిల్లా శాఖల ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాల్లో బాధిత ఉపాధ్యాయులతో కలిసి వెళ్లి సంబంధిత ప్రజా ప్రతినిధులకు సమస్యలు వివరించనున్నారు. తమ సమస్యలపై ముఖ్యమంత్రితో మాట్లాడి తమకు న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పిస్తామన్నారు.
ఇదీ చూడండి: Teachers Transfer issue in Telangana : ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఆలస్యం.. అభ్యంతరాల పరిశీలన వేగవంతం!