హైదరాబాద్ ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలోని రామంతాపూర్లో ఓ గోదాంలో నిల్వ ఉంచిన 34టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక లారీ, 12 చరవాణిలు, 13మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గత రెండు నెలలుగా గుట్టు చప్పుడు కాకుండా ఓ వ్యక్తి రేషన్ దుకాణాల్లో డీలర్లు, లబ్దిదారుల వద్ద కిలో బియ్యం రూ.10 నుంచి రూ.13 వరకు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వాటిని మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పౌరసరఫరా శాఖకు అప్పగించినట్లు తెలిపారు.
ఇదీ చూడండి :'పార్టీ మార్పుపై రాజీవ్ గాంధీ వర్ధంతి తర్వాత నిర్ణయం'