ETV Bharat / state

ఊగిసలాటలో ఉప్పల్‌ పైవంతెన- ఎప్పటికి పూర్తి అయ్యేనో! - Uppal Elevated Corridor

Uppal Bridge Issue in Hyderabad : రహదారిపై నిత్యం అధిక సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించే మార్గం. అంత ప్రాధాన్యమున్న మార్గంలో పై వంతెన నిర్మాణ పనులు సంవత్సరాలుగా సాగుతూనే ఉన్నాయి. దీంతో అటువైపు ప్రయాణించే వాహనదారుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి.

Uppal Elevated Corridor Issue in Hyderabad
Uppal Bridge Issue in Hyderabad
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 30, 2023, 9:27 AM IST

Uppal Bridge Issue in Hyderabad : భాగ్యనగరం నుంచి యాదాద్రి, వరంగల్​ మార్గంలో ట్రాఫిక్​ రద్దీని తగ్గించేలా ఆరు వరుసల ఎలివేటెడ్​ కారిడార్​ నిర్మాణాన్ని 2018లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ప్రారంభించాయి. దీనిలో భాగంగా ఉప్పల్​ రింగ్​ రోడ్డు నుంచి మేడిపల్లి, నాచారం, పీర్జాదిగూడ వరకు సుమారు 7 కిలోమీటర్లు ఫ్లైఓవర్‌(Uppal FlyOver) నిర్మించాలి. దీనికోసం ఆ మార్గంలో నిర్మించిన పిల్లర్లు సంవత్సరాలుగా అలంకారప్రాయంగా ఉన్నాయి. ఈ కారిడార్‌ను రూ.600 కోట్లతో నిర్మించేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ టెండర్లు ఆహ్వానించింది.

Uppal Flyover Bridge Works Delay Reason : టెండర్లు ప్రక్రియలో గాయత్రి సంస్థ సుమారు 25 శాతం తక్కువ మొత్తానికి దక్కించుకుంది. నిబంధనల ప్రకారం 2020 జులైలో నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉండగా మధ్యలో గుత్తేదారు సంస్థ దివాలా తీసిందీ. దీంతో ప్రయాణికులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. అసలే ఇరుగ్గా ఉండే ఈ రహదారిపై పిల్లర్లు మాత్రమే నిర్మించి వదిలేయడంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. వేల సంఖ్యలో వాహనాలు తిరిగే ఈ రహదారికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసేందుకు ఆర్‌ అండ్‌ బి అధికారులు ఆసక్తి చూపలేదు. తాత్కాలిక మరమ్మతులతో నెట్టుకొస్తున్నారు. వర్షాలు కురిస్తే చేసిన పనులు మళ్లీ మొదటికి వస్తున్నాయి.

Uppal Skywalk in Hyderabad : ఉప్పల్‌ స్కైవాక్‌ ప్రారంభం.. ప్రత్యేకతలివీ..

Uppal Elevated Corridor Latest News : హైదరాబాద్​ నగరానికి చెందిన రాజ్​కుమార్​ సమాచార హక్కు చట్టం(Right to Information Act) ద్వారా దరఖాస్తు చేయడంతో జాతీయ రహదారుల విభాగం సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం బయటకి వచ్చింది. ఇప్పటివరకు కేవలం 42.50 శాతం మాత్రమే పనులు పూర్తి అయినట్లు అధికారులు సమాధానమిచ్చారు. గుత్తేదారు సంస్థ ఆర్థిక సమస్యలతో పాటు ఆ మార్గంలో ఉన్న ఆధ్యాత్మిక నిర్మాణాల తొలగింపు వ్యవహారాల వల్ల కొలిక్కి రాలేదని పేర్కొన్నారు.

వాస్తవానికి ఈ వంతెన నిర్మాణం 2020 నాటికే పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటికే పలుమార్లు అధికారులు గడువు పొడిగించారు. రూ.600 కోట్ల పనిని సుమారు రూ. 430 నుంచి రూ. 450 కోట్ల మధ్య చేసేందుకు ఎల్‌1గా నిలిచిన గుత్తేదారు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ఆ వ్యవహారం అప్పట్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం గుత్తేదారు సంస్థ దివాలా ప్రక్రియలో ఉండటంతో నిర్మాణం ఎప్పటికి పూర్తి అవుతుందన్నది ప్రశ్నార్థకంగా ఉంది.

Uppal Sky Walk: మే మొదటి వారంలో అందుబాటులోకి ఉప్పల్​ స్కైవాక్..!

Uppal Flyover Bridge Issue in Hyderabad : నిర్మాణ సమయాన్ని పొడిగించేందుకు అనుమతి ఇచ్చిన పక్షంలో ఎన్సీఎల్టీ ద్వారా నిధులు సమీకరించి పనులు పూర్తి చేస్తామంటూ గుత్తేదారు సంస్థ అధికారులకు లేఖ రాసింది. పెండింగ్‌(Uppal Bridge Pending Works)లో ఉన్న 57.50 శాతం పనులు పూర్తి చేసేందుకు ఆరు నెలల గడువు ఇవ్వవచ్చంటూ కేంద్ర రవాణ, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు అధికారులు ప్రతిపాదలను పంపారు. వారి అంచనా ప్రకారం సుమారు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్లకుపైగా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్సీఎల్టీ నుంచి అంత మొత్తంలో నిధులు విడుదల చేస్తారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఆరు నెలల్లో పనులు పూర్తి చేయడం కూడా సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఉప్పల్​ రింగ్ రోడ్డ్​లోని హోమియోపతి క్లినిక్​లో అగ్నిప్రమాదం - తప్పిన ప్రాణ నష్టం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.