ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల చోటు చేసుకున్న ఉన్నావో ఘటనపై గురువారం నగరంలోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ చీఫ్ జస్టిస్ చంద్రకుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పలువురు సామాజిక వేత్తలు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ అత్యాచారం ఘటనపై పోలీసులు వ్యవహరించిన తీరుపై మండి పడ్డారు. దేశంలో అత్యాచార ఘటనలు పెరుగుతున్నా.. ప్రభుత్వాలు వాటి నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని వక్తలు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని, బాధితులకు న్యాయం చేయకుండా ఘటనకు పాల్పడిన వారిని రక్షించేందుకు ప్రయత్నం చేయడం అన్యాయమన్నారు. ఇకనైనా పోలీసులు ప్రవర్తించే తీరు మారాలని పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : 'చింతమడకలోనే కాదు రాష్ట్రమంతటా రూ.10 లక్షలు ఇవ్వాలి'