తెలంగాణ, ఏపీ సీఎంలకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ లేఖ రాశారు. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టవద్దని కేంద్రమంత్రి అన్నారు. పెండింగ్ అంశాల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ రెండో భేటీ జరగాలని కేంద్రమంత్రి చెప్పారు.
నీటి వివాదాల గురించి లేఖలో షెకావత్ ప్రధానంగా ప్రస్తావించారు. రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం లోపించిందని లేఖలో వెల్లడించారు. రెండు రాష్ట్రాలు తలపెట్టిన పలు ప్రాజెక్టుల గురించి ఆయన ప్రస్తావించారు. కృష్ణా, గోదావరి బోర్డుల ఆదేశాల అమల్లోనూ ఇబ్బందులు వస్తున్నాయని వెల్లడించారు.
ఇదీ చూడండి : అమ్మకేమో అనారోగ్యం.. చిట్టితల్లికి ఆకలి కష్టం!