హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా(bjp) రాష్ట్ర కార్యాలయంలో వినాయక చవితిని(ganesh chaturthi) ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి(kishan reddy) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గణేశునికి ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కిషన్ రెడ్డి... ప్రజలు తలపెట్టిన అన్ని కార్యక్రమాలు నిర్విగ్నంగా జరగాలని ఆకాంక్షించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని... దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని అంతర్జాతీయ శక్తులు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. వాటిని ఎదుర్కొనేలా... ప్రపంచంలోనే మన దేశాన్ని శక్తిశాలిగా తయారు చేసే విధంగా ప్రధాని మోదీని ఆశీర్వదించాలని గణనాథుడిని వేడుకున్నారు.
తెలుగు ప్రజలందరికీ నా తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున వినాయక చవితి పండుగ సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనదేశంలో శాంతి భద్రతలు దెబ్బతీయాలని, దేశాన్ని అస్థిర పరచాలని... దేశ ఆర్థిక వ్యవస్థని దెబ్బతీయాలని, దేశంలోని ఉపాధి అవకాశాలను కొల్లగొట్టాలని అనేక రకాలుగా అంతర్జాతీయ శక్తులు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో విఘ్నేశ్వరుడు ఈ దేశాన్ని మరింత సమవర్థవంతంగా... ప్రపంచంలో భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దేవిధంగా విఘ్నేశ్వరుడు మన ప్రధాని మోదీని ఆశీర్వదించాలని కోరుతున్నాం. దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యలు పరిష్కరించే శక్తి ఇవ్వాలని విఘ్నేశ్వరున్ని మనందరి తరఫున ప్రార్థిస్తున్నాను.
-కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి
ప్రజా సంగ్రామ యాత్రలో (praja sangrama yatra) భాగంగా సంగారెడ్డి జిల్లాలో ఉన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay)... జోగిపేట మండలం సంగుపేటలో పూజలు చేశారు. గణేశ్ చతుర్థి(ganesh Chaturthi) సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
భారతదేశంలోని ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. ఇటు రెండు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలి. ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ వినాయకుడు తొలగించాలి. ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలి. బండి సంజయ్‌కి వినాయకుడి దీవెనలు ఉండాలి. ఆయన పాదయాత్ర చేస్తున్నారు. ఆ యాత్ర విజయవంతం అవ్వాలి. తెలంగాణలో భాజపా అధికారంలోకి రావాలి. ప్రజలకు మేలు చేయాలి. చేస్తుందనే నమ్మకం మా అందరికీ ఉంది.
-విజయశాంతి, భాజపా నాయకురాలు
ఇదీ చదవండి: Khairtabad Ganesh : భాగ్యనగరంలో గణేశుడి సందడి.. ఖైరతాబాద్‌లో భక్తుల కిటకిట