ETV Bharat / state

చివరి బియ్యపు గింజ వరకు కొనుగోలు చేస్తాం: కిషన్​రెడ్డి - telangana latest news

Kishan reddy on Grain collection: హుజూరాబాద్​ ఎన్నికల తర్వాతే రాష్ట్రంలో ధాన్యం సేకరణ సమస్య వచ్చిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం మేరకు చివరి బియ్యపు గింజ వరకు కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.

kishan reddy
kishan reddy
author img

By

Published : Mar 27, 2022, 3:37 PM IST

Kishan reddy on Grain collection: రాష్ట్రంలో ధాన్యం గొడవకు కారణం.. హుజూరాబాద్​ ఉపఎన్నికలేనని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. ఉపఎన్నికల ఫలితాలు తర్వాతే ఈ సమస్య ఎందుకు వచ్చిందో చెప్పాలని డిమాండ్​ చేశారు.

కేంద్ర ప్రభుత్వం 2014లో ధాన్యం, బియ్యం సేకరణకు రూ.3,400 కోట్ల ఖర్చు చేస్తే.. గతేడాది రూ.26,600 కోట్లు ఖర్చుచేసినట్లు చెప్పారు. ప్రస్తుతం బాయిల్డ్ రైస్​కు డిమాండ్ లేదన్నారు. నాలుగైదు ఏళ్లుగా బాయిల్డ్ రైస్​ వినియోగం తగ్గిందని చెప్పారు. గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం ప్రకారం చివరి బియ్యపు గింజా కొంటామని స్పష్టం చేశారు. సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తమకు కార్యాచరణ ఇవ్వడం లేదని కిషన్​రెడ్డి ఆరోపించారు. డబ్ల్యూహెచ్​ఓ నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం విదేశాలకు బియ్యం ఎగుమతి చేయలేదని.. అందుకే ప్రైవేట్​ సంస్థలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వారూ మందుకురావడం లేదన్నారు.

భద్రాచలానికి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేస్తే రైల్వే లైన్​ వేస్తామని కిషన్​రెడ్డి వెల్లడించారు. ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్​ లైన్​ వేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్న కేంద్ర మంత్రి.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. టెక్స్​టైల్​ పార్క్, ట్రైబల్​ మ్యూజియం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదని కిషన్​రెడ్డి ఆరోపించారు. దేశ భవిష్యత్ కోసం తాము బడ్జెట్ ప్రవేశపెడుతుంటే.. తెరాస ప్రభుత్వం మాత్రం వారి భవిష్యత్​ కోసం బడ్జెట్​ పెడుతున్నారని విమర్శించారు.

ఇదీచూడండి: రైతులను ఇబ్బంది పెట్టడమే భాజపా ఏకైక లక్ష్యమా?: బాల్క సుమన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.