ETV Bharat / state

కరోనాను ఓడిద్దాం.. ప్రాణాలతో నిలుద్దాం: కిషన్​రెడ్డి

కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఎవరికి వారు తగు జాగ్రత్తలు తీసుకోవడమే ఏకైక మార్గమని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోందన్న ఆయన.. ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేశారు.

Union Minister Kishan Reddy made several suggestions to the people
కరోనాను ఓడిద్దాం.. ప్రాణాలతో నిలుద్దాం: కేంద్రమంత్రి కిషన్​రెడ్డి
author img

By

Published : Jul 27, 2020, 3:44 PM IST

కరోనాను ఓడిద్దాం.. ప్రాణాలతో నిలుద్దాం: కేంద్రమంత్రి కిషన్​రెడ్డి

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు, మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్​రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధాని మోదీ సూచించిన విధంగా ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నానన్నారు. భౌతిక దూరం, మాస్కు ధరించడం విధిగా పాటించాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని.. గుంపులు గుంపులుగా తిరగొద్దని తెలిపారు.

కరోనా వ్యాధికి కచ్చితమైన మందులు ఇంకా రాలేదని కిషన్​రెడ్డి పేర్కొన్నారు. ఎవరికి వారు తగు జాగ్రత్తలు తీసుకోవడమే వైరస్​ బారిన పడకుండా ఉండేందుకు ఏకైక మార్గమని తెలిపారు. కొవిడ్​ కారణంగా దేశం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వేళ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కరోనాను ఓడించి మనం ప్రాణాలతో నిలుద్దాం.. దేశాన్ని రక్షించుకుందాం అని పిలుపునిచ్చారు.

ఇదీచూడండి: హైదరాబాద్‌లో 150 చేపల అవుట్‌లెట్స్‌: తలసాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.