హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఇండియన్ బ్యాంక్ నూతన శాఖను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ప్రజలందరికీ బ్యాంకు ఖాతా ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్ ఖాతాలు ప్రారంభించిందని మంత్రి తెలిపారు.
ఖాతాదారులకు మరింత భద్రతగా సేవలందించేందుకు కొన్ని బ్యాంకులను విలీనం చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని శాఖలు ఏర్పాటు చేయనున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. వీటి వల్ల బ్యాంకింగ్ మోసాలు తగ్గుతాయని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: అట్టహాసంగా గణతంత్ర వేడుకలు.. త్రివర్ణ పతాకం రెపరెపలు