అంబర్‌పేట కోసం తాను ఎంత చేసినా తక్కువేనని... ఏ పదవిలో ఉన్నా అంబర్‌పేటకి రుణపడి ఉంటానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అంబర్‌పేట ప్రజలు తన గుండెల్లో ఉంటారని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులను గెలిపించి... అభివృద్ధికి బాట వేయాలని కోరారు. తెరాసకి అవకాశం ఇస్తే హైదరాబాద్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయిందని ఆరోపించారు. ఒక్కసారి భాజపాకి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అంబర్‌పేట నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌ను నిలబెడతామని హామీ ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్ దేశవ్యాప్తంగా ఉచితంగా అందజేయడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిపారు. వేల మంది బలిదానాలతో వచ్చిన తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. ఈ ఎన్నికలతో కుటుంబ పాలనకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని అన్నారు.
ఇదీ చదవండి: కామన్ మ్యాన్ కార్పొరేటర్లా పనిచేస్తా: బంగి జయలక్ష్మి