హైదరాబాద్ ఎల్బీనగర్లో దారుణం జరిగింది. అభం శుభం ఎరగని పసికందును గుర్తు తెలియని వ్యక్తులు నిర్మాణంలో ఉన్న భవనం వద్ద విడిచి వెళ్లిపోయారు. ఏడుస్తున్న చిన్నారిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు చిన్నారి విషయమై చైల్డ్ వెల్ఫేర్ సభ్యులకు తెలియజేశారు. చిన్నారికి వైద్య పరీక్షలు చేయించి నగరంలోని శిశు సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు. పసికందును ఎవరు విడిచి వెళ్లారో తెలుసుకునేందుకు సీసీ కెమెరాలలోని దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
ఇదీ చూడండి: రైతన్న కన్నెర్ర.. వీఆర్ఓను బంధించిన అన్నదాత