ETV Bharat / state

Bandi Sanjay: 12న నిరుద్యోగుల మిలియన్ మార్చ్... 21 నుంచి రెండో విడత పాదయాత్ర

నిరుద్యోగుల పక్షాన పోరాటం చేయడాని భాజపా సిద్ధమైందని పార్టీ ముఖ్యనేతలు తెలిపారు. యువకులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. సబ్బండ వర్గాలను కలుపుకుని ఈనెల 12న నిరుద్యోగుల మిలియన్ మార్చ్(Million March), 21న రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తామని ప్రకటించారు. యువకులంతా హైదరాబాద్​కు భారీ ఎత్తున తరలిరావాలని కోరారు.

bandi
bandi
author img

By

Published : Nov 1, 2021, 10:26 PM IST

Updated : Nov 1, 2021, 10:32 PM IST

నిరుద్యోగుల పక్షాన పోరాటం చేయడాని భాజపా సిద్ధమైందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... పదాధికారులతో, జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జ్‌లతో నిర్వహించిన సమావేశంలో పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగుల పక్షాన భాజపా అండగా ఉంటుందని పేర్కొన్నారు. యువకులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. యువకుల పక్షాన పోరాటం చేయడాని సబ్బండ వర్గాలను కలుపుకుని ... ఈనెల 12న నిరుద్యోగుల మిలియన్ మార్చ్, 21న రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తామని ప్రకటించారు. నవంబర్ 12న యువకులంతా హైదరాబాద్​కు భారీ ఎత్తున యువత తరలిరావాలని కోరారు. మిలియన్ మార్చ్​కు సంబంధించి ఈనెల 6, 7 తేదీల్లో జిల్లా సమావేశాలు, 8, 9 తేదీల్లో నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తామన్నారు.

16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర...

నవంబర్ 21 నుంచి జనవరి 10 వరకు 50 రోజులు రెండో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర నిర్వహిస్తామని పాదయాత్ర ఇంఛార్జ్‌ మనోహర్ రెడ్డి తెలిపారు. 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుందన్నారు. ఒకటి రెండు రోజుల్లో పాదయాత్ర పూర్తి వివరాలు, రూట్ మ్యాప్ వెల్లడిస్తామని తెలిపారు. 2022 డిసెంబర్ నాటికి పూర్తి పాదయాత్ర నిర్వహిస్తామని పేర్కొన్నారు.

అసెంబ్లీలో తమ గొంతు నొక్కుతున్నారు...

హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచేందుకు అధికారపార్టీ కుట్రలు చేసిందని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. తమ పార్టీ నేతలను అనేక ఇబ్బందులకు గురిచేశారన్నారు. అధికార పార్టీ అనేక సర్వేలు చేసినా అందులో భాజపాకే మొగ్గు వచ్చిందని పేర్కొన్నారు. దాంతో చివరకు ఓటుకు రూ.6వేల నుంచి రూ.20వేల వరకు ఇచ్చేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధపడ్డారని ఆరోపించారు. చివరకు పోలింగ్ బాక్స్​లను మార్చాలనుకున్నారని తెలిపారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల ద్వారా తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. దీంతో ఎన్నికల కమిషన్​కు ఫిర్యాదు చేశామన్నారు.

హుజూరాబాద్​లోని దళితుల ఓట్ల కోసం దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నప్పటికీ... దళితుల్లో ఈటల రాజేందర్​కు మంచి పేరుండడంతో ఆ పాచిక పారలేదని రాజా సింగ్​ అన్నారు. ఎన్ని చేసినా హుజూరాబాద్​లో భాజపానే గెలువబోతుందని ధీమా వ్యక్తంచేశారు. ఏడేళ్లలో 2లక్షల ఉద్యోగ ఖాళీలకు 30వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీచేశారన్నారు. నిరుద్యోగుల కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని... అసెంబ్లీలో అడిగితే తమ గొంతునొక్కుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: వరంగల్‌లో జరగనున్న తెరాస విజయగర్జన సభ వాయిదా

Last Updated : Nov 1, 2021, 10:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.