ETV Bharat / state

భార్యల మరణాన్ని తట్టుకోలేక భర్తల ఆత్మహత్యలు.. ఒకెేరోజు రెండు వేర్వేరు ఘటనలు..

Unable to Bear Wife Death Husband Commits Suicide:బ్రహ్మ వేసిన ముడి తెగిందని కలత చెందారు. తాను లేని ఈ జీవితం ఎందుకు అనుకున్నారు. కలకాలం తోడుగా వారితో ఉంటానని ఇచ్చిన మాట ప్రకారం వారు ఆమెతో నడిచారు. జీవితాంతం కలిసిమెలిసి ఉంటామని అగ్నిసాక్షిగా ఒక్కటైన వారు మరణంలోను తోడుగా ఉండాలనుకున్నారు. దాంతో కట్టుకున్న భార్య మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకే రోజు రాష్ట్రంలో రెండు వేరువేరు చోట్ల ఇలాంటి హృదయ విదారకర ఘటనలు చోటుచేసుకున్నాయి.

Wife Death Husband Commits Suicide
Wife Death Husband Commits Suicide
author img

By

Published : Feb 28, 2023, 4:47 PM IST

Updated : Feb 28, 2023, 4:55 PM IST

Unable to Bear Wife Death Husband Commits Suicide: కలకాలం తోడుగా ఉంటానని మాటిచ్చిన భర్త.. భార్య మరణాన్ని తట్టుకోలేకపోయాడు. కష్ట, సుఖాలలో తోడుగా ఉంటానని.. చివరి శ్వాస వరకూ వెన్నంటి ఉంటానని చేసిన ప్రమాణాలే వారికి గుర్తుకొచ్చాయి. అందుకే విధి వక్రించి తమకు దూరమైన భార్యల చెంతకే చేరారు ఆ భర్తలు. రాష్ట్రంలో ఇలా ఒకే రోజు రెండు వేరువేరు చోట్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

హైదరాబాద్​లో జీవితాంతం కలిసిమెలిసి ఉంటామని అగ్నిసాక్షిగా వివాహమాడిన ఓ జంటను విధి చిన్నచూపు చూసింది. సనత్​ నగర్ పీఎస్ పరిధిలోని భరత్ నగర్​ ఫ్లై ఓవర్​పై జనవరి 31న జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందింది. అప్పటి నుంచి భార్యను తలచుకుంటూ భర్త లోలోపల క్రుంగిపోతున్నాడు. చివరకు ఇవాళ భార్య మమత(30) మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు ఇంట్లో ఎవరూ లేనిది చూసి భరత్(36) ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

wife and husband died
భరత్-మమత

భరత్ రహ్మత్​నగర్ డివిజన్ కార్మిక నగర్​లో నివాసం ఉంటున్నాడు. నగరంలోని బీహెచ్​ఈఎల్​లో ఆర్టీసీ మెకానిక్​గా పనిచేస్తున్నాడు. అన్యోన్యంగా సాగుతున్న వారి జీవితాన్ని విధి వెక్కిరించింది. దాంతో గత నెల రోడ్డు ప్రమాదంలో భార్య మృతిని జీర్ణించుకోలేక తాను ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న జూబ్లీహిల్స్​ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భరత్, మమతలకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రులు మరణించడంతో ఆ చిన్నారులు శోకసంద్రంలో మునిగిపోయారు.

జనగామ జిల్లాలోను ఇలాంటి మరో హృదయ విదారకర ఘటన చోటుచేసుకుంది. ఆరు నెలల క్రితం భార్య చనిపోయింది. అప్పటి నుంచి ఆమె జ్ఞాపకాలను తలచుకుంటూ భర్త క్షణక్షణం కుమిలిపోతున్నాడు. వాటి నుంచి బయటపడడానికి కుటుంబసభ్యులు మరో పెళ్లి చేశారు. అయినా అతనిని ఇంకా మొదటి భార్య జ్ఞాపకాలే వెంటాడుతున్నాయి. వాటి నుంచి బయటికి రాలేక మనస్తాపం చెందిన ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు.

మొదటి భార్య మరణాన్ని జీర్ణించుకోలేక స్టేషన్​ ఘన్​పూర్​లో భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇవాళ భార్య సమాధి పక్కన పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తాటి రాజు(40) స్టేషన్​ ఘన్​పూర్​లో రైల్వే ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆరు నెలల క్రితం మొదటి భార్య చనిపోగా కుటుంబసభ్యులు రెండో పెళ్లి చేశారు. అయినా అతను మొదటి భార్య జ్ఞాపకాల నుంచి బయటకు రాలేక చివరికి తాను ఆత్మహత్యకు పాల్పడి ఆమె దగ్గరకే వెళ్లాడు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 28, 2023, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.