ETV Bharat / state

'పట్టణాల నుంచి ప్రజలు గ్రామాలకు వలస' - cii president uday kotak

దేశంలో మొదటిసారిగా పట్టణాల నుంచి గ్రామాలకు వలసలు చూశామని కొటక్ మహీంద్ర బ్యాంక్ ఎండీ, సీఈఓ ఉదయ్ కొటక్ అన్నారు. ఇటీవల నూతనంగా ఆయన సీఐఐ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. రానున్న కాలంలో దేశంలో ప్రాధాన్యతలు మారుతాయన్నారు.

uday kotak comment People migrate from cities to villages
'పట్టణాల నుంచి ప్రజలు గ్రామాలకు వలస'
author img

By

Published : Jun 5, 2020, 5:21 AM IST

దేశంలో ఎప్పుడూ గ్రామాల నుంచి పట్టణాలకు వలసలే జరుగుతుంటాయి... కానీ మొదటిసారిగా పట్టణాల నుంచి గ్రామాలకు వలసలు చూశామని భారత పారిశ్రామిక సమాఖ్య అధ్యక్షుడు.. కొటక్ మహీంద్ర బ్యాంక్ ఎండీ, సీఈఓ ఉదయ్ కొటక్ పేర్కొన్నారు. 2020-21కి 10 అంశాలను ప్రాధాన్యంగా తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆర్థిక వృద్ధిని తిరిగి గాడిలో పెట్టేందుకు స్వల్ప కాలంలో డిమాండ్​లో పెరుగుదల ఉండాలన్నారు. అయితే దీర్ఘకాలంలో ప్రైవేటు పెట్టుబడులు, ఎగుమతులు పెరగాలని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం కరోనా మూలంగా రాబోయే కాలంలో దేశంలో ప్రాధాన్యతలు మారుతాయని ఉదయ్​ కొటక్​ తెలిపారు. ఆరోగ్య రంగంపై ఖర్చు భారీగా పెంచాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇటీవల నమోదు చేసుకుంటున్న తుఫానులను బట్టి దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పర్యావరణాన్ని కావాడాల్సి ఉంటుందన్నారు. సమీకృత ద్రవ్య లోటు 11.5 శాతం చేరుకుంటుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. ప్రాణాలు కాపాడటంతోపాటు ఉపాధి కల్పిస్తూ వృద్ధి సాధించాల్సి ఉందని వివరించారు.

ఇదీ చూడండి : ఇకపై వారందరికీ పార్లమెంట్​ ప్రవేశం నిషేధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.