హైదరాబాద్ బోయగూడలోని వేంకటేశ్వర వైన్స్‌లో చోరికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను మధ్యమండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.50 వేల నగదు, రూ.6 వేల రూపాయల విలువ చేసే మద్యం, ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ముషీరాబాద్‌కు చెందిన ఇంద్ర, అబ్దుల్ గఫార్గా పోలీసులు గుర్తించారు.
ఈనెల 1న వైన్స్ పైకప్పు నుంచి లోపలికి ప్రవేశించి మద్యం బాటిళ్లు, రూ.50 వేల నగదు చోరీ చేసి తప్పించుకు తిరుగుతున్నారు. వైన్స్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చూడండి: ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్న కరోనా!