పోలీసులతో దురుసుగా ప్రవర్తించారనే అభియోగాలతో హైదరాబాద్ మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్‌పై బంజారాహిల్స్ ఠాణాలో రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 86లో ఉన్న దాదాపు వెయ్యి గజాల స్థలం చుట్టూ మాజిద్ హుస్సేన్ రేకులు ఏర్పాటు చేయించారని బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ శివచంద్ర తెలిపారు. ఈ స్థలం తనదంటూ నిఖిల్‌రెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి వచ్చారు. విషయం తెలుసుకుని సీఐ శివచంద్ర ఎస్‌ఐ రవిరాజ్‌తో కలిసి వెళ్లారు.
అప్పటికే అక్కడికి వచ్చిన మాజిద్ హుస్సేన్, అతని అనుచరులు రెచ్చిపోయారని...... తమతో దురుసుగా ప్రవర్తించి విధులను అడ్డగించారని సీఐ వివరించారు. నిఖిల్‌రెడ్డి మీదకు మాజిద్ హుస్సేన్ అనుచరుడు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా తాము అడ్డుకున్నట్లు తెలిపారు. దీంతో మాజిద్ హుస్సేన్ ఆగ్రహంతో ఊగిపోయారు. ఎస్‌ఐ రవిరాజ్ ఇచ్చిన ఫిర్యాదుతో మాజీ మేయర్, అతని అనుచరులపై కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి: TALASANI: బస్తీల్లోని పేదల బాధలు అర్ధం చేసుకున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్‌దే